Tuesday, January 27, 2009

తెలుగు వైభవ కీర్తి పతాక - 31-10-2008

దేశ - విదేశములతో గూడి,
 తెలుగు భాషించే 15 కోట్లకు పైబడిన
తెలుగు ప్రజానీకానికి -
 వీనుల విందైన శుభవార్తగా
మనసుకు పసందైన తీపికబురుగా -  
ఈ సువిశాల భారతావనిలో -
 రెండవ అతి పెద్ద అధికార భాషగా -
 భారత ప్రభుత్వంచేగుర్తింపబడి -
 ప్రాచీన హోదా కల్పింపబడిన -
 మన తెనుగు భాష -
 ఆంధ్ర కళామతల్లి గళాన్నలంకరించిన -
 నవరత్నఖచిత సువర్ణ కంఠాభరణమై -
 ధగధ్దగాయమానంగా -
 జగజ్జేగీయమానంగా -
 శత సహస్రాధిక కాంతి పుంజాలతో -
వెలుగు తేజాలతో అలరారగా -
 తెలుగు జాతి వైభవానికి -
 శాశ్వత చిహ్నంగా -
 విజయోత్సాహ కీర్తి ప్రభల ప్రాభవ పతాకాలెగురవేస్తూ -
 తెలుగు పండుగ జరుపుకుందాం.
 తెలుగుకు  సాటి తెలుగేగా -
 తెలుగుకు పోటీ తెలుగేగా -
వరంగా - అదృష్టంగా - భాగ్యంగా  - గర్వంగా - తలెత్తుకుందాం.
 సగర్వంగా తలకెక్కించుకుందాం.
తేనెలొలుకు తెలుగునేమధురంగా మాట్లాడుకుందాం. 
 తెలుగు ప్రపంచంలో హుందాగా జీవిద్దాం.

No comments:

Post a Comment